Renu Desai: కర్నూలు జిల్లాలో ప్రజల కష్టాలు విని కన్నీరు పెట్టుకున్న రేణూ దేశాయ్!

  • కర్నూలు జిల్లాలో పర్యటించిన రేణు
  • ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరామర్శ
  • న్యాయం జరిగేలా చూస్తానని హామీ

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు 'సాక్షి' టీవీ చానల్ తలపెట్టిన ప్రత్యేక కార్యక్రమం 'రచ్చబండ' కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న సినీ నటి రేణూ దేశాయ్, కర్నూలు జిల్లా తంబళబీడు పర్యటనలో ఉన్న వేళ, రైతులు చెప్పిన సమస్యలు విని కన్నీరు పెట్టుకున్నారు. పెదకడబూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న పెద్ద రంగన్న అనే రైతు ఇంటికి వెళ్లిన ఆమె, జిల్లాలో కరవు నేపథ్యంలో రైతులు పడుతున్న కష్టాలు, ఆత్మహత్యలకు దారితీస్తున్న పరిస్థితులపై అధ్యయనం చేశారు.

తమకు కనీసం తాగేందుకు మంచినీరు లేదని, పక్కా గృహాలు లేవని, బ్యాంకు రుణాలను చెల్లించలేకున్నామని రైతులు తమ సమస్యలు చెప్పుకున్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదని చెప్పారు. సమస్యలపై స్పందించిన రేణు, తాను ప్రజా ప్రతినిధిని, అధికారిణిని కాదని, అయినా, ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి న్యాయం జరిగేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు.

Renu Desai
Kurnool District
Andhra Pradesh
Farmers
  • Loading...

More Telugu News