Andhra Pradesh: మాది టీడీపీ కనుకే తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారమివ్వలేదు: రాయపాటి సాంబశివరావు ఆరోపణ

  • హైదరాబాద్ లో ట్రాన్స్ ట్రాయ్ భవనాన్ని కూల్చి వేశారు
  • ఇప్పటి వరకూ నష్టపరిహారం చెల్లించలేదు
  • నష్టపరిహారం కోసం కోర్టును ఆశ్రయించా

తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ లో మెట్రో రైలు నిర్మాణంలో భాగంగా తమ ట్రాన్స్ ట్రాయ్ భవనాన్ని కూల్చి వేశారని, ఇప్పటి వరకూ నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. మాది టీడీపీ కనుకే తెలంగాణ ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించలేదని విమర్శించారు. నష్టపరిహారం చెల్లించాలని కోర్టును ఆశ్రయించామని, అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నరసరావు పేట నుంచే ఎంపీగా పోటీ చేస్తానని, కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై చంద్రబాబు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

Andhra Pradesh
Telugudesam
mp
rayapati
Telangana
  • Loading...

More Telugu News