Chevireddy Bhaskar Reddy: ఓట్లు తొలగిస్తున్నారన్నది వైసీపీ అపోహ మాత్రమే: ఎస్పీ విక్రాంత్ పాటిల్

  • చెవిరెడ్డిపై కేసు నమోదు చేశాం
  • ఓటర్లను తీసివేయడం సాధ్యం కాదు
  • స్థానికులపై కేసు నమోదు చేశాం

చిత్తూరులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి కారణంగా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని భావించి ముందస్తు చర్యగా ఆయనపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. చంద్రగిరిలో తమ ఓట్లు తొలగిస్తున్నారన్నది వైసీపీ అపోహ మాత్రమేనని ఆయన అన్నారు. ఇటీవలే ఎన్నికల కమిషన్.. ఓట్లను తీసివేయడం సాధ్యం కాదని స్పష్టం చేసిందని ఎస్పీ తెలిపారు. నేడు పబ్లిక్ సర్వేలు చేస్తున్నారనే నెపంతో కొందరు యువకులను నిర్బంధించిన స్థానికులపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్టు ఎస్పీ తెలిపారు. వాళ్లకు కోర్టు 15 రోజుల రిమాండ్ విధించిందని పోలీసులు తెలిపారు.

Chevireddy Bhaskar Reddy
YSRCP
Chittor
Vikranth Patil
  • Loading...

More Telugu News