Paresh Rawal: ఐసీసీ జరిమానా విధించినా పోయేదేం లేదు.. పాక్‌తో మాత్రం క్రికెట్ ఆడకూడదు: పరేష్ రావల్
- పాక్‌ని ఓడిస్తే ఒరిగే ప్రయోజనం ఏంటి?
- రెండు పాయింట్లు పోతే నష్టం ఏమీ లేదు
- దేశ ప్రయోజనాలే ముఖ్యం
పుల్వామా ఉగ్రదాడి తరువాత ప్రపంచ కప్ లో భారత్-పాక్ మ్యాచ్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఆడడానికి వీల్లేదంటుంటే.. మరికొందరేమో ఆడి భారత్ సత్తా చాటి చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై బీసీసీఐ ఇంతవరకూ స్పందించలేదు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు పరేష్ రావల్.. పాక్‌తో ఆడకూడదని స్పష్టం చేశారు. తర్వాతి పరిణామాలెలా ఉన్నా.. ఐసీసీ జరిమానా విధించినా పోయేదేం లేదని పేర్కొన్నారు. ఒకవేళ పాక్‌తో ఆడి దానిని ఓడించినంత మాత్రాన దేశానికి ఒరిగే ప్రయోజనం ఏంటో చెప్పాలన్నారు. పాక్‌తో ఆడకపోవడం వల్ల రెండు పాయింట్లు పోయినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదని క్రికెట్ కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని పరేశ్ రావల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.