Polavaram Project: పోలవరం పనులపై 89వ సారి చంద్రబాబు వర్చువల్ రివ్యూ

  • పోలవరం పనులు 66.36 శాతం పూర్తి
  • కాంక్రీటు పనులు 65.30 శాతం
  • దిగువ కాఫర్ డ్యామ్ 10.17 శాతం
  • ఏపీకి మూడో స్థానం దక్కడంపై అభినందనలు

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏపీ సీఎం చంద్రబాబు 89వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించారు. ప్రాజెక్టుకు సంబంధించిన కాంక్రీటు పనులు 65.30 శాతం పూర్తయ్యాయని.. తవ్వకం పనులు 82.60 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకూ మొత్తం పోలవరం పనులు 66.36 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. తవ్వకానికి సంబంధించిన పనులు 82.60 శాతం పూర్తయ్యాయని.. కుడి ప్రధాన కాలువ పనులు 90.29 శాతం పూర్తయ్యాయని తెలిపారు.

ఎడమ ప్రధాన కాలువ పనులు 68.74 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఎగువ కాఫర్ డ్యామ్ 25.73 శాతం, దిగువ కాఫర్ డ్యామ్ 10.17 శాతం పూర్తయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు 62.83 శాతం పూర్తైనట్టు చంద్రబాబు తెలిపారు. జాతీయ జల అవార్డులలో ఉత్తమ రాష్ట్రం విభాగంలో.. ఏపీకి మూడో స్థానం దక్కడంపై జలవనరుల శాఖకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News