Chandrababu: కేంద్ర పథకాలకు కులం, మతం రంగులద్ది భ్రష్టు పట్టించారు: కన్నా లక్ష్మీ నారాయణ

  • మేకిన్ ఇండియాలో భాగంగానే కియా మోటార్స్
  • చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారు
  • పొత్తు పెట్టుకుంటే మోసం చేశారు

కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలకు రాష్ట్రంలో జన్మభూమి కమిటీలు కులం, మతం రంగులద్ది భ్రష్టు పట్టించాయని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. నేడు ఆయన ఆధ్వర్యంలో మేధావుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబును నమ్మి పొత్తు పెట్టుకుంటే మోసం చేశారన్నారు.

చంద్రబాబు తన అసమర్థతను, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ రాక మేకిన్ ఇండియాలో భాగమేనన్నారు. మోదీ ప్రధాని అయ్యాక దేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు.

Chandrababu
Janmabhoomi
Narendra Modi
kanna Lakshminarayana
ananthapuram
kia motors
  • Loading...

More Telugu News