nayana sooryan: 28 ఏళ్ల మలయాళ సినీ దర్శకురాలి అనుమానాస్పద మృతి

  • తన నివాసంలో విగతజీవిగా నయన సూర్యన్
  • 2017లో దర్శకురాలిగా మారిన నయన
  • అంతకు ముందు పలువురు దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పని చేసిన నయన

కేరళలోని తిరువనంతపురంలో 28 ఏళ్ల మహిళా సినీ డైరెక్టర్ నయన సూర్యన్ తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 2017లో దర్శకురాలిగా మారిన ఆమె... అంతకు ముందు పలువురు ప్రముఖ దర్శకులకు అసిస్టెంట్ గా పని చేసింది. ఆమె మృతిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ, పోస్ట్ మార్టం నివేదిక అందితే కానీ, మృతికి గల కారణాలను చెప్పలేమని తెలిపారు. గత కొంత కాలంగా మధుమేహ వ్యాధికి ఆమె చికిత్స పొందుతోందని చెప్పారు.

నయనకు ఆమె తల్లి పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో... ఆమె కంగారుపడి, వెంటనే నయన స్నేహితులకు ఫోన్ చేసి విషయాన్ని తెలిపింది. నయన ఇంటికి వెళ్లిన స్నేహితులకు... బెడ్ రూమ్ లో ఆమె విగతజీవిగా కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అలప్పాడ్ కు చెందిన నయనకు తల్లిదండ్రులతో పాటు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు.

nayana sooryan
director
malluwood
dead
  • Loading...

More Telugu News