sivaji raja: సీనియర్ నటుడు రంగనాథ్ గారి మరణం నన్ను ఆలోచింపజేసింది: 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా

  • వృద్ధాశ్రమ నిర్మాణం నా జీవితాశయం
  • దాతలు ముందుకు వచ్చారు  
  • స్థలాల పరిశీలన జరుగుతోంది    

తెలుగు తెరపై ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషిస్తోన్న శివాజీరాజా, ప్రస్తుతం మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రేపు ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఆయన మీడియా మిత్రులతో ఫిల్మ్ ఛాంబర్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకాంత్, పరుచూరి వెంకటేశ్వరరావు, బెనర్జీ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ వేదికపై శివాజీరాజా మాట్లాడుతూ .. "మా అసోసియేషన్ తరఫున ఇప్పటికే కొన్ని పథకాలు వున్నాయి. ఆ జాబితాలో 'వృద్ధాశ్రమం' కూడా చేర్చాలనేది నా జీవితాశయం. సీనియర్ ఆర్టిస్ట్ రంగనాథ్ గారు చనిపోయిన తరువాత నాకు ఈ ఆలోచన వచ్చింది. నా ఆలోచనను సమర్ధిస్తూ కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చారు .. స్థలాల పరిశీలన జరుగుతోంది. 16 యేళ్ల క్రితం ప్రమాదంలో చనిపోవలసిన నేను బ్రతికుండటమే బోనస్. అందుకే మంచి పనులు చేయడానికి సంకల్పించాను" అంటూ చెప్పుకొచ్చారు. 

sivaji raja
srikanth
paruchuri
  • Loading...

More Telugu News