Telangana: కాంగ్రెస్ చెప్పే లెక్కలు సభకే అర్థం కావట్లేదు, ఇంక ప్రజలకేం అర్థమవుతాయి?: సీఎం కేసీఆర్

  • తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ
  • బడ్జెట్ లెక్కలను తప్పుగా చెప్పారన్న సీఎల్పీ నేత భట్టి 
  • వాటిని తప్పుగా చిత్రీకరించడం సరికాదన్న కేసీఆర్

‘కాంగ్రెస్’ చెప్పే లెక్కలు సభకే అర్థం కావట్లేదు, ఇంక ప్రజలకేం అర్థమవుతాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు. బడ్జెట్ లెక్కలను తప్పుగా చెప్పారని విమర్శించిన భట్టికి ఆయన ఘాటుగా కౌంటరిచ్చారు. రాష్ట్ర బడ్జెట్ పై కాంగ్రెస్ పార్టీ సభ్యులకు అవగాహన లేదని, సభను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడొద్దని కేసీఆర్ సూచించారు. బడ్జెట్ అన్న తర్వాత సవరణలు ఉంటాయని, వాటిని తప్పుగా చిత్రీకరించడం సరికాదని అన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ అంచనాల్లో సవరణలు ఉంటాయన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బడ్జెట్ లెక్కలు తప్పని కాంగ్రెస్ పార్టీ చెప్పడం వందశాతం తప్పని అన్నారు.

Telangana
Congress
assembly
kcr
bhatti
  • Loading...

More Telugu News