pawan kalyan: కర్నూలు జిల్లా టూరులో ఓపక్క పవన్ కల్యాణ్.. మరోపక్క అదే జిల్లాలో 'సాక్షి' యాంకర్ గా రేణు దేశాయ్!

  • కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్
  • ఇదే సమయంలో కర్నూలు జిల్లాలో రైతులను పరామర్శిస్తున్న రేణు
  • సాక్షి టీవీ లోగో పట్టుకుని ఇంటర్వ్యూలు

సినీ నటి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఆత్మహత్యకు పాల్పడిన రెండు రైతు కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. అయితే, ఈ సందర్భంగా ఆమె సాక్షి టీవీ యాంకర్ పాత్రను పోషించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఓ వైపు పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలోనే.. అదే జిల్లాలో రేణు దేశాయ్ కూడా సందడి చేస్తుండటం, అది కూడా సాక్షి టీవీ లోగో పట్టుకుని రైతులను ఇంటర్వ్యూ లు చేస్తుండటం వైసీపీ, జనసేన శ్రేణుల్లో చర్చకు దారితీస్తోంది. పవన్ కు పోటీగా రేణు దేశాయ్ ని వైసీపీ రంగంలోకి దించిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీని వెనుక ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఉందని అనుకుంటున్నారు. మరోపక్క, టీడీపీ, జనసేనలు చేతులు కలపబోతున్నాయని సాక్షి మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. 

pawan kalyan
renu desai
ysrcp
janasena
Kurnool District
tollywood
  • Loading...

More Telugu News