KTR: రాక్ స్టార్ యష్ యాక్టింగ్ అదిరిపోయింది: కేజీఎఫ్'పై కేటీఆర్ ప్రశంసలు

  • ఆలస్యంగానైనా 'కేజీఎఫ్' సినిమా చూశా
  • సినిమా అద్భుతంగా ఉంది
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది

కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన 'కేజీఎఫ్' చిత్రం దక్షిణాది భాషలన్నింటితో సహా హిందీలో కూడా విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా వీక్షించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, 'కొద్దిగా ఆలస్యంగానైనా 'కేజీఎఫ్' చిత్రాన్ని చూశా. వాట్ ఏ మూవీ. టెక్నికల్ గా అద్భుతంగా ఉంది. పట్టుసడలని స్క్రీన్ ప్లేతో దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. రాక్ స్టార్ యష్ నటన అదిరిపోయింది' అంటూ ప్రశంసించారు.

  • Loading...

More Telugu News