telangana: పద్మారావుతో నాకున్న అనుబంధం మరిచిపోలేనిది: కేసీఆర్

  • 20 ఏళ్ల నుంచి పద్మారావుతో అనుబంధం ఉంది
  • కార్పొరేటర్ పదవిని వదులుకుని టీఆర్ఎస్ లో చేరారు
  • ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నా

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన పద్మారావు గౌడ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సభలో ఆయన మాట్లాడుతూ, గత 20 ఏళ్ల నుంచి పద్మారావుతో తనకు మరిచిపోలేని అనుబంధం ఉందని చెప్పారు.  2001లో కార్పొరేటర్ పదవిని వదులుకుని టీఆర్ఎస్ లో పద్మారావు చేరారని... జంటనగరాల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నేత అని కితాబిచ్చారు. జంటనగరాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారని చెప్పారు. పదవిలో ఉన్నా, లేకపోయినా ఆయన ఒకేలా ఉంటారని అన్నారు. భవిష్యత్తులో పద్మారావు మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

telangana
deputy speaker
padmarao
kcr
TRS
  • Loading...

More Telugu News