prabhas: జపాన్ వెళుతోన్న ప్రభాస్ - అనుష్క .. మళ్లీ పుకార్లు మొదలు

  • జపాన్ లోను ప్రభాస్ కి క్రేజ్
  • భారీస్థాయిలో అక్కడ 'మిర్చి' రిలీజ్ 
  • 'డార్లింగ్' రిలీజ్ కి ప్రయత్నాలు

ప్రభాస్ .. అనుష్క వరుస సినిమాలు చేస్తూ రావడం వలన, వాళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోందనే ప్రచారం జరుగుతోంది. తమ మధ్య స్నేహం మాత్రమే ఉందంటూ అటు అనుష్క .. ఇటు ప్రభాస్ చెప్పినప్పటికీ, ఈ పుకార్లు ఆగలేదు. ఇక త్వరలో ప్రభాస్ .. అనుష్క జపాన్ వెళ్లనున్నారనే వార్త బయటికి రావడంతో, మళ్లీ ఈ పుకార్లు ఊపందుకున్నాయి.

అయితే వీరు జపాన్ వెళ్లేది అక్కడ రిలీజ్ కానున్న 'మిర్చి' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికని తెలుస్తోంది. 'బాహుబలి' తరువాత జపాన్ లోను ప్రభాస్ .. అనుష్కలకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. దాంతో అంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'మిర్చి'ని అక్కడ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్ లో పాల్గొనమంటూ అక్కడి డిస్ట్రిబ్యూటర్ పంపిన ఆహ్వానం మేరకు ఈ ఇద్దరూ వెళ్లనున్నట్టు సమాచారం. ఇక ప్రభాస్ నటించిన 'డార్లింగ్' సినిమాను కూడా అక్కడ విడుదల చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట.

  • Loading...

More Telugu News