Hyderabad: డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన యువతి.. పోలీసులకు చుక్కలు చూపించి నానా హంగామా

  • బ్రీత్ అనలైజర్ టెస్టుకు నిరాకరణ
  • పోలీసులను లెక్క చేయని యువతి
  • అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఓ యువతి పోలీసులకు చుక్కలు చూపించింది. శ్వాస పరీక్షకు సహకరించకుండా అరగంటపాటు నానా యాగీ చేసింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10లో నిన్న రాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఓ యువతిని ఆపి బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే, అందుకు నిరాకరించిన ఆమె నానా హంగామా చేసింది. పోలీసులకు సహకరించకుండా వారికి చుక్కలు చూపించింది. మహిళా కానిస్టేబుళ్ల మాటను సైతం ఆమె లెక్కచేయకుండా బ్రీత్ టెస్ట్‌కు ససేమిరా అంది. రోడ్డుపై ఆమె చేసిన హంగామాతో అరగంటపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. చివరికి బలవంతంగా ఆమెకు బ్రీత్ టెస్ట్ నిర్వహించగా మద్యం మోతాదు 44 పాయింట్లు ఉన్నట్టు తేలింది.  

Hyderabad
Jubilee Hills
Banjara Hills
Traffic police
breath analyser
  • Loading...

More Telugu News