Chandrababu: టీడీపీలో చేరేందుకు కొణతాల రెడీ.. 28న చంద్రబాబుతో భేటీ

  • అనకాపల్లి ఎంపీ సీటు కోరుతున్న కొణతాల?
  • చంద్రబాబుతో భేటీలో చర్చించే అవకాశం
  • ఊహాగానాలకు చెక్

చాలా రోజులుగా వస్తున్న ఊహాగానాలకు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెరదించనున్నారు. త్వరలోనే ఆయన టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. విశాఖపట్టణం రైల్వే జోన్ సహా ఏపీకి జరుగుతున్న అన్యాయంపై తరచూ గళం విప్పుతున్న ఆయన రైల్వే జోన్ కోసం నిర్వహించిన ఆందోళనలోనూ పాల్గొన్నారు. కొణతాల త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు ఊపందుకున్నాయి. వాటికి తెరదించుతూ ఈ నెల 28న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచి టీడీపీ లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబుతో భేటీలో అనకాపల్లి సీటు గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.  

Chandrababu
Telugudesam
Andhra Pradesh
Konatala Ramkrishna
Anakapalli
  • Loading...

More Telugu News