Andhra Pradesh: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం.. ప్రేమ జంటపై దాడి.. యువతిపై అత్యాచారం, హత్య

  • బాధితులు భీమడోలు మండల వాసులు
  • బౌద్ధారామాల సందర్శనకు వెళ్లగా ఘటన
  • నిందితుల కోసం పోలీసుల వేట

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఆదివారం కావడంతో కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలోని బౌద్ధారామాల సందర్శనకు వచ్చిన ఓ ప్రేమ జంటపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. యువకుడిని తీవ్రంగా  కొట్టి యువతిని లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోగా, యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.  

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత యువకుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతిపై అత్యాచారం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితులు భీమడోలు మండలం అజ్జవారి గూడెం వారిగా పోలీసులు గుర్తించారు. బౌద్ధారామాలు అటవీప్రాంతంలో ఉండడం, జనసంచారం తక్కువగా ఉండడం వల్లే దాడి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  

Andhra Pradesh
West Godavari District
Bhimadolu
Lovers
Boudha Aramalu
  • Loading...

More Telugu News