Cricket: చివరి బంతికి గెల్చిన ఆసీస్... ఉసూరుమన్న టీమిండియా

  • కడవరకు పోరాడిన కోహ్లీ సేన
  • స్వల్ప లక్ష్యాన్ని కాచుకునేందుకు విఫలయత్నం
  • తొలి టి20 ఆసీస్ కైవసం

ఆస్ట్రేలియాతో తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఆసీస్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రెండు పరుగులు తీసి విజయం సాధించింది. చివరి ఓవర్ లో కంగారూల గెలుపునకు 14 పరుగులు అవసరం కాగా కమ్మిన్స్, రిచర్డ్సన్ జోడీ చెరో ఫోర్ కొట్టి మ్యాచ్ ను భారత్ నుంచి లాగేసుకుంది.

వైజాగ్ ఆతిథ్యం ఇచ్చిన ఈ మ్యాచ్ లో మొదట భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో రాహుల్ చలవతో 7 వికెట్లకు 126 పరుగులు చేసింది. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ కు ఓపెనర్ డార్సీ షార్ట్ 37, గ్లెన్ మ్యాక్స్ వెల్ 56 పరుగులతో విజయానికి బాటలు వేశారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బుమ్రా వరుస బంతుల్లో హ్యాండ్స్ కోంబ్, కౌల్టర్ నైల్ లను వెనక్కి పంపినా ప్రయోజనం లేకపోయింది.

Cricket
India
Australia
  • Loading...

More Telugu News