Visakhapatnam: టీ 20 మ్యాచ్‌లో అమరజవానులకు నివాళి

  • విశాఖ వేదికగా ప్రారంభమైన మ్యాచ్
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
  • మౌనం పాటించి నివాళి అర్పించిన ఇరు దేశాలు

విశాఖ స్టేడియం వేదికగా నేడు టీ 20 మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా పుల్వామా ఆత్మాహుతి దాడిలో అమరులైన జవానులకు నివాళులర్పించారు. నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. భారత క్రికెటర్లు తమ చేతులకు నల్ల బ్యాడ్జీలను ధరించారు. ఇరు దేశాల క్రికెటర్లు తమ జాతీయ గీతాలాపన అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. గతంలో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించిన భారత్.. స్వదేశంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది.

Visakhapatnam
T20 match
National Anthem
India
Australia
  • Loading...

More Telugu News