Jammu And Kashmir: దక్షిణ కశ్మీర్ లోని కుల్గాంలో ఎన్ కౌంటర్..ముగ్గురు ఉగ్రవాదుల హతం!

  • తురిగాం ప్రాంతంలో సంఘటన
  • ‘జైషే మహ్మద్’కు చెందిన వారిగా సమాచారం
  • డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ మృతి

జమ్మూకశ్మీర్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని తురిగాం గ్రామంలో ఆర్మీ, సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ  బృందాలు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహించాయి.

తురిగాం ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా, డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ ఆమన్ కుమార్ మరణించారు. ముగ్గురు సైనికులు గాయపడ్డారు. అమన్ కుమార్ గత రెండేళ్లుగా కుల్గాంలో పని చేస్తున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో హతమైన ఉగ్రవాదులు ‘జైషే మహ్మద్’కు చెందినట్టు తెలుస్తోంది. 

Jammu And Kashmir
kulgam
army
crpf
sog
jaish-e-ahammad
terrorists
police
aaman kumar
  • Loading...

More Telugu News