Uttar Pradesh: ‘పీఎం కిసాన్ సమ్మాన్’ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

  • యూపీ సీఎం స్వగ్రామం గోరఖ్ పూర్ లో ప్రారంభం
  • రైతులకు తొలి విడత చెక్కులు అందజేత
  • ఒక కోటి పది లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది  

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం సమ్మాన్ నిధి) తెలిసిందే. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్వగ్రామమైన గోరఖ్ పూర్ లోని ‘పీఎం సమ్మాన్ నిధి’ ని మోదీ లాంఛనంగా ఈరోజు ప్రారంభించారు. ఈ పథకం తొలి ఇన్ స్టాల్ మెంట్ ను రూ.2000 ను లబ్ధిదారులైన రైతులకు అందజేశారు.

అనంతరం, మోదీ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా ఒక కోటి పది లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా రాజకీయాలు చేయాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల శాపం తగులుతుందని, రాజకీయంగా కూడా భ్రష్టుపట్టి పోతారని అన్నారు.  

 కాగా, ఈ పథకం కింద రూ.75 వేల కోట్ల  రూపాయలు వెచ్చించనున్నారు. రెండు హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతులకు ప్రతి ఏటా రూ.6000 ఇవ్వనున్నారు. ఈ మొత్తం మూడు విడతలుగా రైతులకు అందనుంది. 

  • Loading...

More Telugu News