Andhra Pradesh: ఏపీ మంత్రి సోమిరెడ్డికి మరో షాక్.. వైసీపీలో చేరిన సోదరుడు సుధాకర్ రెడ్డి!

  • వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో చేరిక
  • ఇప్పటికే వైసీపీలో చేరిన సోమిరెడ్డి బావ రామకోటారెడ్డి
  • మంత్రి అవినీతితోనే నేతలు టీడీపీని వీడుతున్నారన్న కాకాణి

ఆంధ్రప్రదేశ్  వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి షాక్ తగిలింది. సోమిరెడ్డి సోదరుడు సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా కాకాణి ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాకాణి మాట్లాడుతూ.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతిని సహించలేకే టీడీపీ నేతలు పార్టీని వీడుతున్నారని తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఇంతకుముందు సోమిరెడ్డికి స్వయానా బావ అయిన రామకోటారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

Andhra Pradesh
Telugudesam
Nellore District
somi reddy
brother
resign
  • Loading...

More Telugu News