Andhra Pradesh: కాంగ్రెస్ ఫిర్యాదుతో నెల్లూరు వైసీపీ కార్యకర్తలపై కేసులు.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన శ్రేణులు!

  • నిన్న భరోసా యాత్ర చేపట్టిన కాంగ్రెస్
  • వెంకటగిరిలో అడ్డుకున్న వైసీపీ నేతలు
  • ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు

నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిన్న చేపట్టిన ‘ప్రత్యేకహోదా భరోసా బస్సు యాత్ర’ను వైసీపీ శ్రేణులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. వెంకటగిరి క్రాస్ రోడ్స్ లో నల్లజెండాలతో కాంగ్రెస్ నేతల బస్సును అడ్డుకోవడంతో పాటు ఏపీ విభజన ద్రోహి, కాంగ్రెస్ గో బ్యాక్, కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఆందోళనలో పాల్గొన్న పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్ట్ చేసేందుకు వెళ్లగా, వారంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో వైసీపీ కార్యకర్తల కోసం గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు.

Andhra Pradesh
Nellore District
YSRCP
Congress
bharosa yatra
Police
  • Loading...

More Telugu News