Andhra Pradesh: రాజకీయాలు దారుణంగా మారిపోయాయి.. అభిమానంతో ఓటేసే పరిస్థితే కనిపించడం లేదు!: సినీ నటుడు సుమన్

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమన్
  • ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపు
  • ఆ నాయకుడు ఎవరో ప్రజలకు తెలుసని వ్యాఖ్య

ప్రస్తుతం రాజకీయాలు దారుణంగా తయారయ్యాయని ప్రముఖ సినీనటుడు సుమన్ తెలిపారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఈరోజు తిరుమలలో వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే పరిస్థితి నెలకొందని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజలకు లంచాలు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడమేనని అభిప్రాయపడ్డారు.

నిజంగా అభిమానంతో ఓటేసే పరిస్థితులు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం, వారి సంక్షేమం, భవిష్యత్ కోసం కష్టపడే నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఆ నాయకుడు ఎవరో అందరికీ తెలుసని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి వెళ్లి తలుపు కొట్టినా వెంటనే స్పందించే నేతలను ఎన్నుకోవాలన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని తాను శ్రీవారిని కోరుకున్నట్లు సుమన్ చెప్పారు.

Andhra Pradesh
Tirumala
hero
Tollywood
suman
politics
comment
  • Loading...

More Telugu News