Telugudesam: నేడు టీడీపీలోకి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్.. చంద్రబాబు సమక్షంలో కండువా

  • నేటి ఉదయం 11:30 గంటలకు టీడీపీలోకి
  • ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా
  • బీజేపీని గద్దె దింపడం టీడీపీకే సాధ్యమన్న మాజీ మంత్రి

కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ నేడు టీడీపీలో చేరబోతున్నారు. ఈ ఉదయం 11:30 గంటలకు ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సమక్షంలో కిశోర్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విజయనగరం జిల్లా నేత టీడీపీలో చేరబోతున్నట్టు విస్తృత ప్రచారం జరిగింది. ఆయన రాకపై విజయనగరానికే చెందిన మరో సీనియర్ నేత అశోక్ గజపతి రాజు వ్యతిరేకించినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే, చంద్రబాబు సర్దిచెప్పడంతో అశోక్ గజపతి రాజు మెత్తబడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కిశోర్ చేరికకు మార్గం సుగమమైనట్టు చెబుతున్నారు.

కాగా, ఇటీవల కిశోర్ చంద్రదేవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పుకొచ్చారు. బీజేపీని గద్దె దించేందుకే తాను టీడీపీలో చేరబోతున్నట్టు పేర్కొన్నారు. అశోక్ గజపతి రాజుతో తనకు ఎటువంటి విభేదాలు లేవని, ఆయనతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు.

Telugudesam
Chandrababu
Kishor Chandra dev
Congress
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News