Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నాగార్జున సరసన రకుల్ ఖరారు 
  • కోనసీమలో 'వెంకీమామ' సందడి 
  • దిల్ రాజు చేతిలో '118' చిత్రం

*  నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా కథానాయికగా నటించనుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందే 'మన్మథుడు 2' చిత్రంలో నాగ్, రకుల్ జంటగా నటిస్తారు. ఇందుకోసం రకుల్ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది.
*  వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా రూపొందుతున్న 'వెంకీమామ' చిత్రం షూటింగ్ కోనసీమలోని తాటిపాక గ్రామంలో నేటి నుంచి జరుగుతుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం అక్కడి పరిసరాల్లో రెండు వారాల పాటు షూటింగ్ చేస్తారు.
*  నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం '118' తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్నట్టు సమాచారం. కేవీ గుహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా థామస్, శాలిని పాండే హీరోయిన్లుగా నటించారు.

  • Loading...

More Telugu News