goa: మళ్లీ ఆసుపత్రిలో చేరిన గోవా సీఎం.. ఆరోగ్యం నిలకడగా ఉందన్న రాష్ట్ర మంత్రి

  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పారికర్
  • ఇటీవలే తిరిగి విధుల్లోకి
  • ఎండోస్కోపీ కోసమే ఆసుపత్రిలో చేరారన్న సీఎంవో

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ (63) శనివారం రాత్రి మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఆయన అప్పర్ జీఐ ఎండోస్కోపీ కోసమే  గోవా మెడికల్ కాలేజీ హాస్పిటల్ (జీఎంసీహెచ్)లో చేరారని సీఎం కార్యాలయం తెలిపింది. ఒక రోజంతా ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపింది.  

‘‘సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన అబ్జర్వేషన్‌లో ఉన్నారు. సీఎంను ఐసోలేటెడ్ రూములో పెట్టి చికిత్స అందిస్తున్నాం. ఓ రోజంతా ఆయన ఇక్కడే ఉంటారు. వైద్యులు కొన్ని పరీక్షలు చేయాలంటేనే ఆయన ఇక్కడికి వచ్చారు. పారికర్ ఓ ఫైటర్. ఒక్క రోజులోనే ఆయన తిరిగి ఇంటికి వెళ్తారు’’ అని గోవా ఆరోగ్యశాఖా మంత్రి విశ్వజీత్ రాణె పేర్కొన్నారు.

goa
Manohar parrikar
Goa Medical College
GI endoscopy
  • Loading...

More Telugu News