baddam balreddy: బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి ఆరోగ్యం విషమం

  • కేర్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స
  • పేగు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బద్దం
  • మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బీజేపీ నేత 

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి ఆరోగ్యం విషమించింది. బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో ఆయనకు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన పేగు క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ నెల 10వ తేదీన ఆయన కేర్ ఆసుపత్రిలో చేరారు. విషయం తెలిసిన వెంటనే బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా బాల్ రెడ్డి గెలుపొందారు. గత ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

baddam balreddy
bjp
dead
  • Loading...

More Telugu News