kcr: 30 లక్షల కోట్లు ఖర్చుపెట్టబోతున్నాం.. అప్పు చేసినా చెల్లించే స్తొమత రాష్ట్రానికి ఉంది: కేసీఆర్
- రానున్న పదేళ్లలో రూ. 30 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం
- మోదీకి 100 లేఖలు రాసినా స్పందన లేదు
- రూ. 50 వేల కోట్లతో గ్రామాలను బాగు చేస్తాం
రానున్న పదేళ్లలో రూ. 30 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అప్పులు తెచ్చి కాళేశ్వరంలాంటి భారీ ప్రాజెక్టులను కడుతున్నామని చెప్పారు. అప్పు చేసినా తీర్చే స్తొమత రాష్ట్రానికి ఉందని తెలిపారు. సెక్షన్-3 కింద కేటాయింపులు జరపాలని ప్రధాని మోదీకి ఇప్పటి వరకు 100 లేఖలు రాసినా స్పందన లేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తక్కువ ప్రొటోకాల్ ఉన్న మంత్రులను కూడా కలిశానని చెప్పారు. రూ. 50 వేల కోట్లతో గ్రామాలను బాగు చేస్తామని హామీ ఇచ్చారు. ఆరు నెలల్లోగా భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేస్తామని తెలిపారు.