Andhra Pradesh: లండన్ లో విజయ్ మాల్యాతో జగన్ రహస్యంగా భేటీ అయ్యారు!: బుద్ధా వెంకన్న సంచలన ఆరోపణ

  • హవాలా డబ్బును తరలించేందుకు జగన్ టూర్
  • ఈ భేటీ వివరాలను బయటపెట్టాలి
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత

బ్రిటన్ లోని లండన్ పర్యటనకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత, ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. లండన్ కు వెళ్లిన జగన్ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాతో రహస్యంగా భేటీ అయ్యారని వెంకన్న ఆరోపించారు. ఎన్నికల కోసం హవాలా డబ్బును భారత్ కు తరలించేందుకే ఈ సమావేశం జరిగిందని విమర్శించారు. ఈ భేటీ వివరాలను జగన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడారు.

నిన్న చెన్నైలోని ఓ హోటల్ లో వైసీపీ నేతలు జరిపిన రహస్య భేటీ వివరాలను బయటపెట్టాలని వెంకన్న డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిధుల కోసమే ఈ సమావేశం జరిగిందని ఆరోపించారు. జగన్ లండన్ పర్యటనలో ఎవరెవరిని కలిశారో చెప్పాలన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరనీ, ఏపీలో మరోసారి తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
budha
venkanna
Jagan
YSRCP
vijay malya
london tour
britain
  • Loading...

More Telugu News