jagan: కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడుస్తోంది: కిల్లి కృపారాణి

  • కేసీఆర్, జగన్ లు చేతులు కలిపితే తప్పేముంది?
  • కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు బాధించాయి
  •  చంద్రబాబు యూపీఏలో చేరచ్చు కదా?    

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ లు చేతులు కలిపితే తప్పేమిటని వైసీపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను ఎంతో బాధించాయని ఆమె అన్నారు. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడుస్తోందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని నమ్ముతున్న చంద్రబాబు... యూపీఏలో చేరవచ్చు కదా అని ప్రశ్నించారు. ఇటీవలే జగన్ ను కలిసిన కృపారాణి... ఈనెల 28న జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.

jagan
kcr
Chandrababu
Rahul Gandhi
killi kruparani
congress
Telugudesam
ysrcp
TRS
  • Loading...

More Telugu News