Andhra Pradesh: మాపై వైసీపీ నేతలు 20 సార్లు ఈసీకి తప్పుడు ఫిర్యాదులు చేశారు.. నా భార్యకు రెండు ఓట్లు లేవు!: ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ

  • కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై మండిపడ్డ టీడీపీ నేత
  • తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆగ్రహం
  • రెండు ఓట్లు పెట్టుకోవాల్సిన ఖర్మ పట్టలేదని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీనే మరోసారి అధికారంలోకి రాబోతోందని అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ జోస్యం చెప్పారు.  రాబోయే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేనందున వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 20 సార్లు రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదులు చేశారని మండిపడ్డారు. అందులో భాగంగానే తన భార్యకు రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నట్లు తప్పుడు ఆధారాలు సృష్టించారని మండిపడ్డారు.

అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన భార్యకు రెండు చోట్ల ఓటు హక్కు లేదనీ, తమకు అంత ఖర్మ పట్టలేదని ఎమ్మెల్యే సూర్యనారాయణ స్పష్టం చేశారు. ధర్మవరంలో గెలిచే అవకాశం లేకపోవడంతోనే వైసీపీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.

Andhra Pradesh
Anantapur District
Telugudesam
mla
surya narayana
YSRCP
keti reddy
angry
two votes
  • Loading...

More Telugu News