Andhra Pradesh: ఎర్రన్నాయుడు పుట్టినరోజు నేడు.. ‘హ్యాపీ బర్త్ డే నాన్నా’ అంటూ ట్వీట్ చేసిన రామ్మోహన్ నాయుడు!

- తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన టీడీపీ నేత
- గతంలో తండ్రితో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన రామ్మోహన్
- ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత
తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ సీనియర్ నేత దివంగత కింజరపు ఎర్రన్నాయుడు పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం లోక్ సభ సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్నా’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చిన్నప్పుడు తనకు తండ్రి ఎర్రన్నాయుడు కేక్ తినిపిస్తున్న ఫొటోను రామ్మోహన్ నాయుడు పోస్ట్ చేశారు.
