kotala: కేఈతో మాకు ఇబ్బంది లేదు.. అందరం కలిసి టీడీపీని గెలిపించుకుంటాం: కోట్ల

  • గతంలో మూడు ఎన్నికల్లో కలసి పని చేశాం
  • చంద్రబాబు ఆదేశిస్తే కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేస్తా
  • నా కుమారుడు ఈ ఎన్నికల్లో పోటీ చేయరు

డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో తమకు ఎలాంటి విభేదాలు లేవని...ఆయనతో కలసి పని చేసేందుకు తమకు అభ్యంతరం లేదని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. గతంలో తామిద్దరం కలసి మూడు ఎన్నికల్లో పని చేశామని చెప్పారు. 20 ఏళ్ల క్రితం ఫ్యాక్షన్ ఎక్కువగా ఉన్న రోజుల్లో మూడు ఎన్నికల్లో కలసి పని చేశామని... ఇప్పుడు ఫ్యాక్షన్ కూడా లేదని, గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయని చెప్పారు.

సీట్ల కోసం తాము టీడీపీలో చేరడం లేదని కోట్ల స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తే కర్నూలు ఎంపీగా తాను పోటీ చేస్తానని చెప్పారు. తన భార్య సుజాతమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, తన కుమారుడు రాఘవేంద్రరెడ్డి ఎన్నికల్లో పోటీ చేయరని తెలిపారు. 2024లో తన స్థానంలో తన వారసుడిగా ఎంపీగా పోటీ చేస్తారని చెప్పారు. కోడుమూరులో మంచి అభ్యర్థిని పోటీలో నిలపాలని చంద్రబాబుకు సూచిస్తామని అన్నారు.

kotala
ke krishna murthy
Kurnool District
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News