Digvijay Singh: మోదీకి 56 అంగుళాల ఛాతీ ఉంటే.. ఈ విషయాన్ని సీరియస్‌గా ఎందుకు తీసుకోవడం లేదు?: దిగ్విజయ్ సింగ్

  • మోదీ 56 అంగుళాల ఛాతీని కొలిచింది ఎవరో?
  • పుల్వమా దాడితో దేశం మొత్తం షాక్‌లో ఉంటే మోదీ షూటింగులో..
  • భారత్-సౌదీ సంయక్త ప్రకటనలో పుల్వామా దాడి విషయమేదీ?

ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోమారు విరుచుకుపడ్డారు. 56 అంగుళాల అతిపెద్ద ఛాతీ ఉందని చెప్పుకుంటున్న మోదీ, పుల్వామా ఘటనను ఎందుకు తీవ్రంగా పరిగణించడం లేదని ప్రశ్నించారు. భారత్-సౌదీ అరేబియా సంయుక్త ప్రకటనలో పాకిస్థాన్ గురించి ప్రస్తావించారే తప్ప పుల్వామా దాడి గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో కేంద్రం మెతక వైఖరి అవలంబిస్తోందని దుయ్యబట్టారు.

అసలింతకీ మోదీ 56 అంగుళాల ఛాతీని కొలిచింది ఎవరని దిగ్విజయ్ ప్రశ్నించారు. ఆయనకు నిజంగా అంత ఛాతీ ఉంటే ఉల్వామా దాడిని ఎందుకు సీరియస్‌గా పరిగణించడం లేదని నిలదీశారు. ఫిబ్రవరి 14న జవాన్లపై దాడి జరిగి దేశం మొత్తం షాక్‌లో ఉంటే మోదీ మాత్రం జిమ్‌కార్బెట్ పార్క్‌లో షూటింగులో బిజీగా ఉన్నారని మండిపడ్డారు.

Digvijay Singh
Pulwama
Modi chest
Jim Corbett Park
Saudi Arabia
Congress
  • Loading...

More Telugu News