whatapp: వాట్సాప్ ద్వారా చేసే వేధింపులకు చెక్... ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక ఈమెయిల్!
- కేటుగాళ్లను అడ్డుకునేందుకు డాట్ నిర్ణయం
- అభ్యంతరకర, అశ్లీల సందేశాలు పంపేవారికి ముకుతాడు
- ఫిర్యాదు చేసిన వెంటనే ప్రొవైడర్లు, పోలీసుల దృష్టికి
వాట్సాప్‌లో అశ్లీల, అసభ్యకర సందేశాలను పంపి వేధిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (డాట్) నిర్ణయించింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక సామాజిక మాధ్యమాల ద్వారా యువతులను, మహిళలను వేధిస్తున్న కేటుగాళ్ల సంఖ్య పెరిగిపోయంది. ఇటీవల కాలంలో పలువురు పేరొందిన మహిళలు, మహిళా జర్నలిస్టులు కూడా బాధితుల లిస్టులో ఉంటున్నారు.
ఇలాంటి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో డాట్ అప్రమత్తమయింది. వేధింపులకు పాల్పడుతున్న వారిపై తక్షణం ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేక మెయిల్‌ను రూపొందించింది. ccaddndot@nic.in మెయిల్‌కు బాధితులు ఫిర్యాదు పంపిన వెంటనే దాన్ని పోలీసులతోపాటు సంబంధిత ప్రొవైడర్ దృష్టికి తీసుకువెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డాట్ వెల్లడించింది.