Sabbam Hari: చంద్రబాబువి పాజిటివ్ పాలిటిక్స్.. కేసీఆర్‌వి చిల్లర రాజకీయాలు: సబ్బం హరి

  • కేసీఆర్ సీఎం కాకూడదని చంద్రబాబు ప్రయత్నించినా విఫలమయ్యారు
  • మోదీని చంద్రబాబు ఎదురొడ్డడం వల్లే ఇక్కడి రాజకీయాల్లో మార్పు
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వచ్చేవి 150 స్థానాలే

నెగెటివ్ రాజకీయాలు చేసే వ్యక్తుల కంటే పాజిటివ్ రాజకీయాలు చేసే వ్యక్తులకు విలువ ఉంటుందని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర రాజకీయాలకు మాత్రమే పనికొస్తారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన సీఎం కాకూడదని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నించినా ఆయన సీఎం అయ్యారని పేర్కొన్నారు.

చంద్రబాబువి పాజిటివ్ పాలిటిక్స్ అని పేర్కొన్న సబ్బం హరి.. మోదీని చంద్రబాబు టార్గెట్ చేయడం వల్లే ఇక్కడి రాజకీయాల్లో మార్పు వచ్చిందని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి 270కి పైగా స్థానాలు వచ్చాయని, ఈసారి 150-160 స్థానాలకు పడిపోతుందని జోస్యం చెప్పారు. ఇక, ఏపీలో బీజేపీ అసలు ఖాతా కూడా తెరవదని అన్నారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం అంటూ ఏర్పడితే చంద్రబాబు కీలకం అవుతారని  హరి  పేర్కొన్నారు.

Sabbam Hari
Visakhapatnam District
Andhra Pradesh
KCR
Chandrababu
Narendra Modi
  • Loading...

More Telugu News