Andhra Pradesh: నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లకు డబ్బులు.. బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు

  • న్యాయవాది ఫిర్యాదుతో నోటీసులు
  • రోడ్‌షోలో డబ్బులు పంచారంటూ ఆరోపణలు
  • సీఈసీకి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, కర్నూలు కలెక్టర్‌కు కూడా

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా 16 ఆగస్టు 2017న నిర్వహించిన రోడ్‌ షోలో ఓటర్లకు బాలకృష్ణ డబ్బులు పంచారంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది కె.శివకుమార్ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఓటర్లకు బాలకృష్ణ డబ్బుల పంపకంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని పిటిషనర్ పేర్కొన్నారు. తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల బెంచ్.. గతంలో ఏమైనా నోటీసులు జారీ చేశారా? అని ప్రశ్నించింది. పిటిషనర్ లేదని చెప్పడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, కర్నూలు కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది.

Andhra Pradesh
Balakrishna
High Court
Notice
Nandyal
Kurnool District
  • Loading...

More Telugu News