Sabbam Hari: వెళ్తే టీడీపీలోకి వెళ్తా.. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా: సబ్బం హరి

  • పోలవరంపై జీవీఎల్ అసత్య ప్రచారం
  • మోదీ తన సొంత ఆస్తిని ఇవ్వడం లేదు
  • రాజధాని కోసం చంద్రబాబు చేయాల్సిందంతా చేస్తున్నారు

గత కొంతకాలంగా ఏపీలోని టీడీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్న మాజీ మంత్రి సబ్బం హరి తన రాజకీయ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత తరుణంలో తన ముందు రెండే దారులు ఉన్నాయన్నారు. అందులో ఒకటి టీడీపీలో చేరడం కాగా, రెండోది రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకోవడమని పేర్కొన్నారు.

రాష్ట్రానికి ఆవగింజ అంత అయినా సాయం చేయాలని ఉందన్న సబ్బం.. పోలవరంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాల నుంచి కేంద్రానికి డబ్బులు వెళ్తాయని, ప్రధాని నరేంద్రమోదీ ఏమీ ఆయన తాతలు సంపాదించిన ఆస్తిని ఇవ్వడం లేదన్నారు. పోలవరం విషయంలో కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు.  ప్రభుత్వ పరంగా రాజధానికి అవసరమైనదంతా చంద్రబాబు చేస్తున్నారని సబ్బం హరి పేర్కొన్నారు.

Sabbam Hari
Visakhapatnam District
Andhra Pradesh
Telugudesam
Polavaram
BJP
  • Loading...

More Telugu News