Pawan Kalyan: అస్వస్థతకు గురయ్యారని తెలిసి.. కోలుకుంటారనుకున్నా: పవన్ కల్యాణ్

  • మరణ వార్త విని ఆవేదన చెందాను
  • విజువల్ ఎఫెక్ట్స్‌లో తనదైన శైలి చూపించారు
  • కోడి రామకృష్ణ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఇటీవల అస్వస్థతకు లోనయ్యారని తెలిసి, తిరిగి కోలుకుంటారని భావించానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయన మృతి చెందారని తెలుసుకుని ఆవేదన చెందానని ఆయన పేర్కొన్నారు. కోడి రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని పవన్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

కోడి రామకృష్ణ తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో తన అన్నయ్య చిరంజీవి కథానాయకుడని పేర్కొన్నారు. నాటి నుంచి ఆయన విభిన్న చిత్రాలు సినీ పరిశ్రమకు అందించినప్పటికీ.. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా రూపొందించడంలోనూ తనదైన శైలిని చూపించారన్నారు. కోడి రామకృష్ణ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పవన్ పేర్కొన్నారు.

Pawan Kalyan
Kodi Ramakrishna
Chiranjeevi
Intlo Ramayya Veedhilo Krishnaiah
Visual Effects
  • Loading...

More Telugu News