Tollywood: కోడి రామకృష్ణతో నాది ముప్పై నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం: నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి భావోద్వేగం

  • ‘తలంబ్రాలు’ కన్నా ముందే ఆయనతో పరిచయం ఉంది
  • కోడి రామకృష్ణ లేరన్న వార్తతో మాటలు రావట్లేదు
  • ఆయన లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా

ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మృతితో పలువురు టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కోడి రామకృష్ణతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగం చెందారు. కోడి రామకృష్ణతో ముప్పై నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం చేశానని అన్నారు. తలంబ్రాలు చిత్రం కన్నా ముందు నుంచే ఆయనతో తనకు పరిచయం ఉందని గుర్తుచేసుకున్నారు. కోడి రామకృష్ణ లేరన్న విషయం చెప్పడానికి మాటలు రావట్లేదని, ఆ వార్తను నమ్మలేకపోతున్నానని చెమర్చిన కళ్లతో శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నారు.  

Tollywood
director
kodi ramakrishna
producer
shyamprasad reddy
  • Loading...

More Telugu News