IPL: అమర జవానులకు నివాళిగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు రద్దు

  • ప్రతి ఏటా ఆడంబరంగా ఆరంభ వేడుకలు  
  • రెండు వారాల షెడ్యూల్ విడుదల
  • లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత పూర్తి జాబితా

ప్రతి ఏటా ఐపీఎల్ సీజన్ మొదలవుతుందంటే మొదటి రోజు హంగామాయే వేరు. బాణసంచాతోపాటు టాలీవుడ్ నటీనటులు, గాయకులతో అంబరాన్నంటే సంబరాలు నిర్వహిస్తుంటారు. మార్చి 23న ఐపీఎల్ 12వ ఎడిషన్ ప్రారంభం కానుంది. కానీ ఈ ఏడాది ఆరంభ వేడుకలను బీసీసీఐ క్రికెట్ పాలకుల కమిటీ రద్దు చేసింది.

కార్యక్రమానికి కేటాయించిన డబ్బును పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవానుల కుటుంబాలకు అందజేస్తామని పాలకుల కమిటీ అధినేత వినోద్ రాయ్ తెలిపారు. అమర జవానుల గౌరవార్థం వేడుకలను రద్దు చేసినట్టు ఆయన వెల్లడించారు. టోర్నీకి సంబంధించిన రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రమే నిర్వాహకులు విడుదల చేశారు. దానిలో 17 మ్యాచ్‌ల వివరాలను పొందుపరిచారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత పూర్తి మ్యాచ్‌ల జాబితాను విడుదల చేయనున్నారు.

IPL
Tollywood
12th Edition
Vinod Rai
BCCI
Loksabha
  • Loading...

More Telugu News