Telangana: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన

  • 5 స్థానాల్లో నాలుగు టీఆర్ఎస్ కు.. మిత్రపక్షానికి ఒకటి  
  • మంత్రి మహమూద్ అలీ సహా నలుగురికి అవకాశం
  • సీఎం కేసీఆర్ నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఐదు స్థానాల్లో నాల్గింటిని టీఆర్ఎస్ తీసుకుని, ఒక స్థానాన్ని తమ మిత్రపక్షమైన ఎంఐఎంకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హోం మంత్రి మహమూద్ అలీ, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమ లను తమ పార్టీ అభ్యర్థులుగా పేర్కొన్నారు.

Telangana
TRS
mla kota
mlc elections
kcr
  • Loading...

More Telugu News