Andhra Pradesh: పవన్ కల్యాణ్ టీడీపీతో కలిశారంటూ వార్తలు.. ఘాటుగా స్పందించిన జనసేన అధినేత!

  • జనసేనకు 25 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లు ఆఫర్
  • టీడీపీ ఇచ్చిందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు
  • టీడీపీ, వైసీపీపై తీవ్రంగా మండిపడ్డ జనసేనాని

ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీతో జనసేన పార్టీ కలిసి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతోందని కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరిగింది. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనకు 25 అసెంబ్లీ, మూడు లోక్ సభ, ఓ రాజ్యసభ సీటును టీడీపీ ఆఫర్ చేసిందని కూడా వార్తలొచ్చాయి. ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ, వైసీపీపై లక్ష్యంగా విరుచుకుపడ్డారు.

ఈరోజు ట్విట్టర్ లో పవన్ కల్యాణ్ స్పందిస్తూ..‘జనసేన వైసీపీ-బీజేపీలకు భాగస్వామిగా ఉందని టీడీపీ చెబుతోంది. ఇప్పుడు టీడీపీతో మేం కలిసిపోయామని వైసీపీ చెబుతోంది. నేను రాజ్ భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కాగానే, నేను టీఆర్ఎస్-వైసీపీ మనిషినని టీడీపీ ఆరోపిస్తుంది. మనం నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు అన్ని పక్షాల నుంచి విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది’ అని ట్వీట్ చేశారు. దీనికి స్మైలీ ఎమోజీని పవన్ కల్యాణ్ జత చేశారు.

Andhra Pradesh
Telangana
Telugudesam
YSRCP
Jana Sena
Pawan Kalyan
Twitter
ANGRY
CRITICISE
  • Loading...

More Telugu News