Andhra Pradesh: జోరు పెంచిన వైసీపీ.. 31 మందితో మేనిఫెస్టో కమిటీని నియమించిన జగన్!

  • ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలో కమిటీ
  • వైసీపీ హామీలు, పథకాలతో మేనిఫెస్టో రూపకల్పన
  • ట్విట్టర్ లో ప్రకటించిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష వైసీపీ జోరు పెంచింది. అన్నివర్గాలను ఆకట్టుకునేందుకు వీలుగా మేనిఫెస్టో రూపకల్పనకు సిద్ధమయింది. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలో 30 మంది సభ్యులతో మేనిఫెస్టో కమిటీని వైసీపీ అధినేత జగన్ నియమించారు. వైసీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలు, కార్యక్రమాల  జాబితాను మేనిఫెస్టో కమిటీ రూపొందించనుంది.

Andhra Pradesh
YSRCP
Twitter
manifesto committee
Jagan
  • Loading...

More Telugu News