Telangana: రేపు తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక.. పద్మారావు గౌడ్ పేరు ఖరారు

  • డిప్యూటీ స్పీకర్ పదవికి రేపు నోటిఫికేషన్ విడుదల
  • రేపు, సోమవారం బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి
  • అసెంబ్లీలో చీఫ్ విప్, విప్ ల నియామకంపై రేపు ప్రకటన

రేపు తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సోమవారం జరగనుంది. ఈ పదవికి మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. కాగా, రేపు, సోమవారం బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. బడ్జెట్ పై చర్చ జరగనుంది. అసెంబ్లీలో చీఫ్ విప్, విప్ ల నియామకంపై కూడా రేపు ఓ ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం.

Telangana
deputy speaker
padmarao goud
  • Loading...

More Telugu News