Andhra Pradesh: చంద్రబాబూ.. ఈ నాటకాలు ఎందుకు.. మీ హృదయం కలచివేయడానికి ఐదేళ్లు పట్టిందా?: ఐవైఆర్ కృష్ణారావు

  • జీవో 76కు ఇప్పటివరకూ అతీగతీ లేదు
  • పేద అర్చకులను ఆదుకోవడం మీ విధానం కాదని చెప్పేయండి
  • ఈ హిపోక్రసీని భరించలేకపోతున్నాం

అర్చకులు పేదరికంతో మగ్గిపోవడం తనను కలచివేసిందనీ, అందుకే పురోహితుల జీతాలు పెంచామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు  హృదయం కలచివేయడానికి ఐదు సంవత్సరాలు పట్టిందని కృష్ణారావు ఎద్దేవా చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో కృష్ణారావు స్పందిస్తూ..‘ఎందుకీ కపట నాటకాలు? మీ హృదయం కలచి వేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ జీవో 76 కు అతీగతీ లేదు. గ్రామాల్లో అర్చకత్వం చేసుకునే బీద పురోహితులకు చేయూత నివ్వడం మా పార్టీ విధానం కాదని స్పష్టంగా చెబితే సరిపోతుంది. ఈ హిపోక్రసీ భరించలేకుండా వున్నాం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Chandrababu
priest
iyr krishna rao
BJP
  • Loading...

More Telugu News