Telangana: తెలంగాణ బడ్జెట్ పై ప్రశంసలు కురిపించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్!

  • అన్నిరంగాలకు సమతుల్యతతో కేటాయింపులు
  • రైతుబంధు, రుణమాఫీ అమలుకు వీలు
  • ట్విట్టర్ లో స్పందించిన మాజీ మంత్రి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయం, మౌలికవసతుల అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాలకు సమతుల్యత పాటిస్తూ కేటాయింపులు చేశారని ప్రశంసించారు. రైతు బంధు, పెన్షన్ల పెంపు, రుణమాఫీ వంటి హామీలను నెరవేర్చేందుకు వీలుగా ఈ కేటాయింపులు చేశారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడి ఘటనలో చనిపోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారాన్ని కేసీఆర్ ప్రకటించడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

Telangana
budget 2019-20
KCR
TRS
KTR
Twitter
praise
  • Loading...

More Telugu News