Andhra Pradesh: రౌడీ చింతమనేనికి చంద్రబాబు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి, ప్రజలపైకి వదిలేశారు!: వైసీపీ నేత రోజా

  • మహిళలను వేధించిన మంత్రుల్లో సగం మంది టీడీపీలోనే
  • గతంలో రంగారెడ్డి, పరిటాలను బాబు అడ్డుతొలగించుకున్నారు
  • ఇప్పుడు జగన్ పై హత్యాయత్నం చేయించారు

ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ నేతలపై వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా ఈరోజు విరుచుకుపడ్డారు. దేశంలో మహిళలను వేధించిన నలుగురు మంత్రుల్లో ఇద్దరు ఏపీ సీఎం చంద్రబాబు మంత్రివర్గంలోనే ఉన్నారని రోజా విమర్శించారు. రౌడీ చింతమనేనికి ప్రభుత్వ విప్ పదవి ఇచ్చిన చంద్రబాబు ఆయన్ను ప్రజలపైకి వదిలేశారని దుయ్యబట్టారు.

తన రాజకీయ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడం చంద్రబాబుకు అలవాటని రోజా వ్యాఖ్యానించారు. గతంలో రంగారెడ్డి, మాధవరెడ్డి, పరిటాల రవిలను ఇలాగే అడ్డు తొలగించుకున్నారని ఆరోపించారు. తాజాగా ఏపీలో వైసీపీ అధినేత జగన్ ను ఎదుర్కోలేక, ఆయనపై కూడా హత్యాయత్నం చేయించారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
roja
Chinthamaneni Prabhakar
  • Loading...

More Telugu News