India: నెల్లూరుకు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్.. ఘనంగా స్వాగతం పలికిన సోమిరెడ్డి, నారాయణ!

  • వెంకయ్యనాయుడు ఇంటికెళ్లిన రాష్ట్రపతి
  • అనంతరం అక్షర విద్యాలయం సందర్శన
  • స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవాల్లో పాల్గొననున్న కోవింద్

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు నెల్లూరుకు చేరుకున్నారు. తొలుత చెన్నైకు వెళ్లిన కోవింద్ అక్కడి నుంచి హెలికాప్టర్ లో నేరుగా నెల్లూరులోని పోలీస్ కవాతు మైదానంలో దిగారు. ఆయనకు ఏపీ మంత్రులు సోమిరెడ్డి, నారాయణ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి నేరుగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి బయలుదేరారు.

ఈ పర్యటనలో భాగంగా కోవింద్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వెంకటాచలం అక్షర విద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి విద్యార్థులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత స్వర్ణభారత్ ట్రస్టు వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా, రాష్ట్రపతి నెల్లూరు పర్యటన నేపథ్యంలో అధికారులు ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

India
Ram Nath Kovind
President Of India
nellore
Telugudesam
Andhra Pradesh
somireddy
narayana
  • Loading...

More Telugu News