mahanayakudu: 'మహానాయకుడు' చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి: తమ్మారెడ్డి భరద్వాజ

  • ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఒదిగిపోయారు
  • అప్పట్లో జరిగిన ఘటనలన్నింటినీ చూపించారు
  • మా తరం వారికి పాత స్మృతులు గుర్తుకొస్తాయి

'మహానాయకుడు' సినిమా చాలా అద్భుతంగా ఉందని... సినిమా చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయని ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. మళ్లీ రామారావుగారిని చూసిన ఫీలింగ్ వచ్చిందని చెప్పారు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్యబాబు ఒదిగిపోయారని కితాబిచ్చారు. తండ్రిని మించిన తనయుడు అనిపించారని ప్రశంసించారు. చిత్రాన్ని క్రిష్ అద్భుతంగా తెరకెక్కించారని చెప్పారు.

అప్పట్లో జరిగిన ఘటనలన్నింటినీ సినిమాలో చూపించారని... ఆ రోజుల్లో తాము కూడా రోడ్లపైకి వచ్చామని తమ్మారెడ్డి తెలిపారు. తమ తరం వారికి పాత స్మృతులన్నీ మళ్లీ గుర్తుకు వస్తాయని చెప్పారు. అద్భుతమైన సినిమా చేసిన బాలయ్య, క్రిష్ లకు హ్యాట్సాఫ్ అని అన్నారు.

mahanayakudu
balakrishna
tammareddy bharadwaj
krish
ntr
tollywood
  • Loading...

More Telugu News